అంబటి రాంబాబు తలకు రంగు వేయకపోవడానికి కారణం ఇదే: జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు

  • పవన్ ను అంబటి విమర్శిస్తే ఊరుకోబోమన్న గాదె
  • సత్తెనపల్లిలో అంబటిపై జనసేన పోటీ చేస్తుందని వ్యాఖ్య
  • సీనియర్ గా కనిపించేందుకే జుట్టుకు రంగు వేసుకోవడం లేదని ఎద్దేవా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పవన్ గురించి కానీ, వారాహి యాత్ర గురించి కానీ విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అంబటి నీటిపారుదల మంత్రి కాదని, నోటిపారుదల మంత్రి అని విమర్శించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు అంబటి ఇంతవరకు సమాధానం చెప్పలేదని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిలో అంబటిపై జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. నీటిపారుదల శాఖకు అంబటి న్యాయం చేయలేదని అన్నారు. వైసీపీలో సీనియర్ గా కనిపించేందుకే అంబటి జుట్టుకు రంగు వేయడం లేదని చెప్పారు. సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Gade Venkateswar Rao
Pawan Kalyan
Janasena
Ambati Rambabu
YSRCP

More Telugu News